Thursday, 17 September 2026 12:43:32 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 07 August 2026 03:38 PM Views : 96

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి మండలం రెండు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేయాలి ప్రాధాన్యత అంశాలకు అనుగుణంగా కనీసం 25 శాతం ప్రాజెక్టు ఆధారిత కార్యకలాపాలు చేపట్టాలి జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక , మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కార్యాచరణ సమావేశం లో జిల్లా కలెక్టర్ అంకిత్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక , మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతమైన సాధనమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలో జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు . భారత ప్రభుత్వం నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రతి మండలం రెండు లక్ష్యాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసి, ఆయా లక్ష్యాలకు సంబంధించిన కనీసం 25 శాతం ప్రాజెక్టు ఆధారిత కార్యకలాపాలను మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో తప్పనిసరిగా పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లక్ష్యాలు గ్రామాల అవసరాలు, స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని సూచించారు. మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంపీడీవోలు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన గణాంకాలు, భౌతిక, ఆర్థిక ప్రగతి, అవసరాల వివరాలను సకాలంలో అందించి ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని ఆదేశించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు గ్రామాల వాస్తవ అవసరాలను ప్రతిబింబించేలా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల, ఆరోగ్యవంతమైన గ్రామాలు, బాలలకు అనుకూల వాతావరణం, నాణ్యమైన విద్య, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ వనరుల పెంపు కోసం గ్రామీణ పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, పశుసంవర్థక అభివృద్ధి, సేంద్రీయ వ్యవసాయం, గ్రామ ఉత్పత్తుల జియో ట్యాగింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయ వృద్ధి కార్యక్రమాలు వంటి ప్రాజెక్టులను ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి తమ శాఖల పథకాలు, నిధులు, వనరులను సమీకరిస్తూ ఫండ్ కన్వర్జెన్స్ ద్వారా గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి, గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని తెలిపారు. ప్రతి ప్రాజెక్టుకు లక్ష్యం, అంచనా వ్యయం, నిధుల వనరు, అమలు చేసే శాఖ, కాలపట్టిక, ఆశించిన ఫలితాలను స్పష్టంగా తెలుపుతూ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రూపొందించే ప్రణాళికలు గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడటంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి నిర్దేశిత గడువులోగా ప్రతిపాదనలు సమర్పించాలని, శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :