Monday, 03 August 2026 09:31:47 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వ్యవసాయ కమిటీ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 21 May 2026 03:09 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం కొత్తగూడెం వ్యవసాయ కమిటీ మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు, నిల్వలు, అన్‌లోడింగ్ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ మండలాల నుంచి రైతులు మొక్కజొన్నతో మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ట్రాక్టర్లు, లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ గోడౌన్లలో అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం, గోడౌన్ల వినియోగం, రవాణా ఏర్పాట్లు, హమాలీల అందుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ కమిటీ మార్కెట్‌లో సుమారు 2500 మెట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం అందుబాటులో ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, గుండాల మండలాలకు చెందిన మొక్కజొన్నను ఈ మార్కెట్‌కు మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్న బస్తాల అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, వివిధ మండలాల నుంచి వచ్చిన ట్రాక్టర్లు, లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా అవసరమైన హమాలీలు, యంత్ర సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం సుమారు 110 మంది హమాలీలు విధుల్లో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కజొన్న బస్తాల తూకం, నిల్వ, రవాణా ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని, గోడౌన్లలో నిల్వలను శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డులో రైతులకు తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో తాసిల్దార్ శిరీష, వ్యవసాయ,మార్కెట్ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :