Wednesday, 16 September 2026 06:06:25 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

Date : 12 August 2025 08:14 PM Views : 922

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధి తిరుమలకుంట నివాసి లింగాల జయలక్ష్మి తన ఫిర్యాదులో తన భర్త ఆర్.ఎం.పీ. డాక్టర్‌గా లింగాల చక్రధరరావు పని చేస్తున్నాడని, 2022 డిసెంబర్ 08న దురదపాడు (గ్రా) నుండి ఫోన్ వచ్చినదని, పేషెంట్ వైద్యం చేయడానికి వెళుతున్నానని తనకు వరుసకు కోడలైన దాసరి రమణకు చెప్పి బయటకు వెళ్లాడని తాను సాయంత్రం ఇంటికి రాగా చెప్పినది. ఆ రాత్రికి నేను ఫోన్ చేయగా నేను వచ్చేసరికి రాత్రి అవుతుంది మీరు తిని పడుకోండి అని చెప్పారని, ఆ తర్వాత కూడా రెండుసార్లు ఫోన్ చేస్తే తను ఎత్తలేదని, ఇంటికి కూడా రాలేదని. 2022 డిసెంబర్ 9న రెండు సార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. పక్కింటి పరికల చేను రామా నా భర్తకు కాల్ చేయగా ఎవరో లిఫ్ట్ చేసి, మందులు కొనడానికి భద్రాచలం వెళ్ళాడని చెప్పారు. నేను భయం వేసి నా కూతురు బండి ప్రభావతికి ఫోన్ చేయగా, నా వద్దకు వచ్చినది. వినాయకపురం లోని గుగ్లోత్ వెంకటేశ్వరరావు గారి జీడి మామిడి తోట ముందున్న పొలానికి వెళ్ళే దారిలో మృతదేహం ఉందని వార్త వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో నా కుమారుడు విజయబాలు హైదరాబాద్ నుండి వాట్సాప్ ద్వారా నా కూతురికి చెప్పడంతో, నా కూతురు నాకు చెప్పకుండా ఆటోలో 11 గంటలకు మృతదేహం వద్దకు తీసుకెళ్లగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుడి భుజం నుండి పదునైన ఆయుధంతో నరికి చంపిన గుర్తులు ఉన్నాయని, వారిపై తగిన చర్య తీసుకొమ్మని అప్పటి అశ్వారావుపేట సబ్‌ఇన్స్పెక్టర్ బి. రాజేష్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్, బి. బాలకృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు దర్యాప్తు అనంతరం కోర్టులో అశ్వారావుపేట మండలం తుమ్మలకుంట నివాసి షేక్ నసీర్ @ నజీర్ @ థంగ్లి అట్టి హత్య చేశాడని, అప్పటి ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో 22 మంది సాక్షుల విచారణ అనంతరం ఇరు పక్షాల వాద, ప్రతి వాదనలు విన్న తదుపరి షేక్ నజీర్‌పై హత్యా నేరము రుజువు కాగా జీవిత ఖైదు, రూ.1000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. అశ్వారావుపేట సబ్‌ఇన్స్పెక్టర్ వై. రాజు, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసి బి. నాగేశ్వరరావు లు సహకరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :