తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ జూలూరుపాడు గ్రామ శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎర్రజెండాను సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు ఎగురవేశారు. ప్రధాన రహదారిపై వెంగ న్నపాలెంగ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎర్రజెండాను సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ ఎగురవేశారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వందేళ్ల ఘనమైన చరిత్రతో శత వార్షికోత్సవాలను సీపీఐ సముపార్జన చేసిందని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర నేటి, భావితరాలకు లెనినిజం,మార్క్సిజం సిద్ధాంతం - అధ్యయనం - ఆచరణ, వీరోచిత పోరాటాలు - ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాలు అపారమైన త్యాగాలు - అనుభవాలు, ప్రజల ఆశాకిరణంగా ఎదుగుదల సంక్షోభాల ఆటుపోట్లు విజయాలు పరాజయాలు, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉత్తేజాన్ని నింపడం డీలాపడడం, పెరగడం - తగ్గడం, ఉద్యమం ఎత్తుపల్లాలు, కమ్యూనిస్టు నైతికతను బోధించే వర్గపోరాటల చరిత్ర అని అన్నారు. సమాజ మార్పు కోసం ఉద్యమించే ఉద్యమకారులకు సీపీఐ మార్గదర్శకంగా నిలిచిందన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల వలస పాలనపై కన్నెర్రజేస్తూ, దోపిడీరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా, ఎర్రజెండాను సమున్నతంగా ఎగరేస్తూ, ఆవిర్భవించిన పార్టీ సీపీఐ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, సీపీఐ నాయకులు ఎల్లంకి మధు, గుడిమెట్ల సీతయ్య, చెరుకుమల్ల రాజేశ్వరరావు, గుండె పిన్ని మధు. కొండా వీరయ్య, దేవినేని రాము, బరగడ రమేష్, పత్తిపాటి మహేష్, బడుగు వీరస్వామి, దర్శనాన్ని లక్ష్మీనారాయణ, కాశీ మల్ల శంకర్, పసుపులేటి పవన్ భాస్కర్, చీమకుర్తి సంతోష్, వెంకటప్పయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ