తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ జె . శ్రీనివాస రావు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి జిల్లా పర్యటన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవ్యవస్థకు చెందిన న్యాయాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ