తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జూలూరుపాడు మండలం బేతలపాడు గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో భూక్య రమేష్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ ప్రతి పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు మెంబర్ లతో సహా పోటీలో ఉంటామని గెలుపునకు అనుసరించాల్సిన ప్రణాళికల గురించి , సర్పంచ్ , ఎంపీటీసీ , జడ్పీటీసీ , స్థానాలకు ఇంచార్జ్ లను నియమించడం మరియు గ్రామ స్థాయిలో పార్టీ లో చేరికలు , పార్టీ నీ సంస్థాగతంగా బలోపేతం చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు , ఉపాధ్యక్షులు ధారావత్ బాలకిషన్, యువమోర్చా అధ్యక్షుడు గూగులోత్ రాంబాబు,గిరిజన మోర్చా అధ్యక్షుడు భూక్యా రవి, సోషల్ మీడియా కన్వీనర్ భూక్యా చరణ్,సెక్రటరీ గూగులోత్ బాబులాల్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ