Thursday, 17 September 2026 06:47:27 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కు తుమ్మల ధన్యవాదాలు .

Date : 17 August 2026 08:24 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సత్తుపల్లి ట్రంక్‌ భూసేకరణకు రూ.45 కోట్లు విడుదల•మూడో నుంచి నాలుగో పంప్‌హౌస్‌ మధ్య 532 ఎకరాల భూ సేకరణకు నిధులు•ఈ సీజన్‌లోనే ఆయకట్టుకు గోదావరి జలాలు •పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం•ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కు తుమ్మల ధన్యవాదాలు .సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్‌ పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మంత్రి తుమ్మల ప్రత్యేక కృషితో మూడు మండలాలు సస్యశ్యామలం కానున్నాయి. మూడో పంప్‌హౌస్‌ నుంచి నాలుగో పంప్‌హౌస్‌ మధ్య అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసింది. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలో మొత్తం 532 ఎకరాల భూమి సేకరణకు ఈ నిధులను వినియోగించనున్నారు.గురువారం నాడు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయి, దమ్మపేట, అశ్వరావుపేట, సత్తుపల్లి మండలాల పరిధిలో 532 ఎకరాల భూసేకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దమ్మపేట, అశ్వరావుపేట, సత్తుపల్లి మండలాల్లోని భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం లభించనుంది.ఈ భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, మూడో పంప్‌హౌస్‌ నుంచి నాలుగో పంప్‌హౌస్‌ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అవసరమైన పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌లోనే ఆయకట్టుకు నీరు అందించేలా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.1.50 లక్షల ఎకరాలకు సాగునీరు.సీతారామ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర మండలాలకు గోదావరి జలాలు చేరనున్నాయి. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు వర్షాధార పంటలనున సాగు చేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో సీతారామ ప్రాజెక్టు జలాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.సీఎం రేవంత్‌, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు.సత్తుపల్లి ట్రంక్‌ భూసేకరణకు రూ.45 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భూసేకరణ, పైప్‌లైన్‌, పంప్‌హౌస్‌ తదితర పనులను సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఆయకట్టుకు చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :