Friday, 18 September 2026 02:08:30 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 20 May 2026 07:28 PM Views : 238

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచి ఎక్కువ పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, మహిళా స్వయం సహాయక సంఘాలు, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (ఎన్‌ఎఫ్‌బీఎస్), చేయూత పథకం తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈవో దివ్య అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు వేగవంతం కావడానికి సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొత్త జాబ్ కార్డులు మంజూరు చేసి, ఉపాధి హామీ కూలీలు పూర్తి స్థాయిలో పని దినాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, చేయూత పథకాల లబ్ధి అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూడీఐడీ (యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ) కార్డులను అందరికీ అందేలా ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయం 5 గంటలకు పనిస్థలాలకు చేరుకొని విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. మండలాల్లో నమోదైన జాబ్‌కార్డు కార్మికుల హాజరు శాతం పెంచి కనీసం 40 రోజుల పాటు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జూన్ చివరి నాటికి మెటీరియల్ కాంపొనెంట్ క్రింద బుక్ చేయగల నిధులపై ఈఈలు పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. జల్ సంచయి జన్ భగీరథి పురస్కారాలను జిల్లా సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. చేయూత పెన్షన్ లబ్ధిదారుల లైవ్‌నెస్ అథెంటికేషన్‌ను పారదర్శకంగా నిర్వహించి నగదు పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. దివ్యాంగుల సదరం కేంద్రాల్లో సౌండ్ ప్రూఫ్ పరికరాలు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలులో అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :