Monday, 03 August 2026 10:18:09 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

చైనీస్ మాంజాపై ఉక్కుపాదం. విక్రయించినా,నిల్వ ఉంచినా క్రిమినల్‌ కేసులు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్.

Date : 07 January 2026 10:32 AM Views : 291

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయాలు,వాడకంపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.పక్షుల స్వేచ్ఛకు,అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా,నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ,అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్నారు.చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని తెలిపారు.ఇది మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ,విక్రయం,నిల్వ,వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించడం జరిగిందని సూచించారు.ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినామని తెలిపారు.భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా అన్ని గాలి పటాల విక్రయ కేంద్రాలు,చిన్న కిరాణా దుకాణాలు,అనుమానిత గోదాములపై CCS మరియు స్థానిక పోలీసులతో సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని అన్నారు.కేవలం విక్రయదారులే కాకుండా,ఇతర రాష్ట్రాల నుంచి భద్రాచలానికి అక్రమంగా ఈ నిషేధిత మాంజాను రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు,పార్శిల్ సర్వీసులపైనా నిఘా పెంచామని,వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.చైనీస్ మాంజాలో ప్లాస్టిక్,ఇతర సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉంటుందని,దీని వల్ల ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడంతో పాటు,పిల్లల వేళ్లు తెగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.అంతేకాకుండా,ఇందులో ఉండే మెటాలిక్ పదార్థాల వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.పట్టణ పౌరులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు.తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు లేదా నిల్వ చేసినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి గానీ,ఏఎస్పీ కార్యాలయ ఫోన్ నంబరు 8712682104 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :