Thursday, 17 September 2026 09:47:30 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు .

Date : 05 April 2026 06:17 PM Views : 336

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్వాతంత్ర్య సమరయోధుడు,నవభారత నిర్మాత,మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజు జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జగ్జీవన్‌రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని ఒక పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత పదవులను అధిష్టించిన మహనీయుడని కొనియాడారు.చిన్నతనం నుండే సమాజంలో ఉన్న కుల వివక్షకు,అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన,విద్యనే ఆయుధంగా మలచుకుని అన్యాయాలపై పోరాడారని పేర్కొన్నారు.స్వతంత్ర భారత తొలి క్యాబినెట్‌లో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగ్జీవన్‌రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను అమలు చేసినట్లు ఎస్పీ వివరించారు.బాబు జగ్జీవన్‌రామ్ గారి జీవితం ఒక తెరిచిన పాఠశాల వంటిదని,సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎస్పీ అన్నారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం,సోదరభావం కలిగిన సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి,దేశ సమగ్రతకు కృషి చేయడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ,మాతృదేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,వన్ టౌన్ సీఐ కరుణాకర్,ఎంటిఓ సుధాకర్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎస్సైలు ప్రవీణ్,రవి,రామకృష్ణ,మనీషాలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :