తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే అంకెల గారడి తప్ప మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు పాతర వేశారని, అబద్ధాలు అంకెలు తప్ప వాస్తవాలు లేవని, ప్రధాన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు అడ్డం పడుతుందని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ... ఆరు గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గత బడ్జెట్ లోనూ, ఈ బడ్జెట్‌లోనూ నయాపైసా కేటాయించలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భ్రుతిపై బడ్జెట్‌లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు అని తెలిపారు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదని, వృద్ధుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసిందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదన్నారు. ప్రధాన రంగాలైన విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణమని, రైతుకిచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసారని విమర్శించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ