తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్పో2025 తొలి అడుగు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హైస్కూల్ లో ఈరోజు జరిగింది, జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ నమూనాలను ప్రదర్శించారు. ఆహారం, వ్యవసాయం, పర్యావరణం, రవాణా, కమ్యూనికేషన్ వంటి వివిధ అంశాలపై ఎంతో సృజనాత్మకంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నమూనాలు ఆలోచన రేకేత్తించేవిధంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. దేశంలోని వివిధ ప్రముఖ సంస్థల నుండి విచ్చేసిన సైంటిస్ట్ లు విద్యార్థులకు పలు సూచనలు సలహాలు బహుమతులు అందించి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ