Saturday, 19 September 2026 04:21:50 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

విపత్తులపై అవగాహన–సన్నద్ధతతోనే ప్రాణ, ఆస్తి నష్టం నివారణ: కలెక్టర్ అంకిత్.

Date : 06 April 2026 06:50 PM Views : 226

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్తులపై సరైన అవగాహనతో పాటు ముందస్తు సన్నద్ధత ఉంటేనే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్ (ఫామెక్స్)–2026 కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని ఆమె సూచించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఎన్‌డీఆర్ఎఫ్ ఫామెక్స్–2026 నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ శాఖల అధికారులతో, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలసి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ బిటన్ సింగ్ సారథ్యంలో బృంద సభ్యులు పాల్గొన్నారు.జిల్లా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరదలు వంటి విపత్తులకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక (డీడీఎంపీ) అమలు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ & బీ, ఇరిగేషన్, వ్యవసాయం తదితర శాఖల సమన్వయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , జిల్లాలో ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు, ఎన్‌డీఆర్ఎఫ్ పాత్రను ప్రజలకు చేరవేయేందుకు ఫామెక్స్ కార్యక్రమాలు కీలకమని అన్నారు . షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి 15 రోజులపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలలో అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్), ఆపద మిత్ర, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఎన్‌డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫామెక్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెరుగుతుందని, విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ బిటన్ సింగ్ తెలిపారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రాథమిక చికిత్స, నేలకూలిన నిర్మాణాల్లో శోధన మరియు రక్షణ చర్యలు, రసాయన మరియు జీవ విపత్తులకు స్పందన, అగ్ని ప్రమాదాలు, తుపాన్లు, భూకంపాలు వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశం లో జడ్ పి సి ఈ ఓ నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరవు, వైద్య శాఖ అధికారి తుకారాం రాతోడ్, విధ్యుత్ శాఖ ఎస్ ఈ మహీందర్,ఎన్‌డీఆర్ఎఫ్ సభ్యులు గోవిందరావు, జగదీష్, రంజిత్, ఎస్ డి ఆర్ ఎఫ్ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :