తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ( ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం, రేగళ్ళ గ్రామంలో వేంచేసియున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర, లక్ష్మణ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు. ఆలయ అర్చక సిబ్బంది వారికి సంప్రదాయ బద్దంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్దప్రసాదాలు అందించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు రాముల వారి కృపతో రేగళ్ల ప్రాంతం సష్యశ్యామలం కావాలని, అందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టఐశ్వర్యాలతో తులనాడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ