Thursday, 17 September 2026 07:12:01 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

యువత, కళాకారులు, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పిలుపు

Date : 07 August 2025 05:41 PM Views : 587

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ – ఈశాన్య భారత కలయిక: ఒక సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం" – లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్ డిజైన్ పోటీకి సృజనాత్మక ఎంట్రీలు కోరుతూ పిలుపుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత, విద్యార్థులు, కళాకారులు మరియు డిజైనర్లు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటుకునే సువర్ణావకాశంగా,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం, రాజ్‌భవన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న"తెలంగాణ – ఈశాన్య భారత కలయిక: ఒక సాంకేతిక-సాంస్కృతిక మహోత్సవం"సందర్భంగా లోగో డిజైన్, ట్యాగ్‌లైన్ రచన, పోస్టర్ రూపకల్పనలపై ఓపెన్ పోటీకి ప్రజల నుండి సృజనాత్మక ఎంట్రీలు కోరుతున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.ఈ మహోత్సవం 2025 నవంబర్ 25–27 మరియు డిసెంబర్ 2–4 తేదీలలో హైదరాబాద్‌లో రెండు దశలుగా నిర్వహించబడనుందని,ఈ వేడుక ప్రధాన ఉద్దేశం – తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల (NE States) మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరస్పర మార్పిడికి వేదిక కల్పించడం అని కలెక్టర్ గారు వివరించారు. పోటీకి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయని కలెక్టర్ గారు వివరించారు. పోటీ విభాగాలు:1. లోగో డిజైన్ 2. ట్యాగ్‌లైన్ రచన3. పోస్టర్ రూపకల్పన (A4/A3 సైజులో, డిజిటల్ ఫార్మాట్)ఎంట్రీల సమర్పణ మార్గదర్శకాలు:లోగో: ఒరిజినల్, స్కేలబుల్ PNG & ఎడిటబుల్ ఫార్మాట్ (AI/CDR/PSD) ట్యాగ్‌లైన్: ఇంగ్లీషులో, 10 పదాలకు లోపు, పోస్టర్: 300 డీపీఐ PNG లేదా PDF ఫార్మాట్ సబ్మిట్ చేయుటకు:ఇమెయిల్: telangananortheastconnect@gmail.com Subject Line: Entry for Logo/Tagline/Poster – [మీ పేరు] చివరి తేదీ: 15 ఆగస్టు 2025ఎంట్రీతో పాటు పంపవలసిన వివరాలు:పూర్తి పేరు ,వయసు, వృత్తి ,మొబైల్ నంబర్, ఇమెయిల్ ఛిచిరునామా లేదా ఐడి ప్రూఫ్ , 50–100 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న ఆలోచన వివరాలు , నగదు బహుమతులు:ఉత్తమ లోగో డిజైన్ – ₹15,000 , ఉత్తమ ట్యాగ్‌లైన్ – ₹5,000 , ఉత్తమ పోస్టర్ డిజైన్ – ₹20,000అధికారిక సన్మాన కార్యక్రమం:ఎంపికైన విజేతలకు రాజ్‌భవన్, హైదరాబాద్ లో జరిగే అధికారిక కార్యక్రమంలో ఘన సన్మానం లభిస్తుంది. విజేతల డిజైన్‌లు, ట్యాగ్‌లైన్లు తెలంగాణ ప్రభుత్వ ప్రచారంలో భాగంగా వినియోగించబడతాయని కలెక్టర్ గారు తెలిపారు.ముఖ్య నిబంధనలు*:అన్ని ఎంట్రీలు ఒరిజినల్‌గా ఉండాలి. కాపీరైట్ ఉల్లంఘనలు ఉండకూడదు .ప్లాజియరిజం (నకలు) నిషేధం .లోగోలో తృతీయ పక్ష ఫోటోలు, ఐకాన్లు వాడకూడదు . ఎంపిక ప్రమాణాలు: సృజనాత్మకత, ఒరిజినాలిటీ, సాంకేతిక నైపుణ్యం, విజువల్ ఆకర్షణ . ఎంపికైన ఎంట్రీలు రాజ్‌భవన్ మేధోసంపత్తిగా పరిగణించబడతాయి . ఒక్కరే బహుళ ఎంట్రీలు పంపవచ్చు – అయితే ప్రతి ఎంట్రీని విడిగా పంపాలి . జిల్లా కలెక్టర్ గారి పిలుపుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ –"ఇలాంటి పోటీలు, ఉత్సవాలు జిల్లాలోని యువతకు తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప వేదిక.తెలంగాణ మరియు ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబించేలా మీరు రూపొందించే డిజైన్‌లుభవిష్యత్‌లో ప్రభుత్వ ప్రచారాల్లో భాగంగా ఉపయోగించబడతాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలు, కళాశాలలు, కళాకారులు చురుకుగా పాల్గొనాలి.ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలి" అని తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :