Sunday, 02 August 2026 04:07:17 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎమ్మెల్యే చొరవతో అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులు

Date : 07 February 2026 10:36 AM Views : 263

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే చొరవతో అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులు - పట్టణంలో మంచినీటి పైప్ లైన్ పనులు - కొత్తగూడెంను కార్పొరేషన్ చేసిన ఘనత ఎమ్మెల్యే కూనంనేనిదే - 26వ డివిజన్లో సిపిఐ విస్తృత ప్రచారం - సిపిఐ అభ్యర్థులను గెలిపించండి - ఓట్లు మీరు వేయండి - అభివృద్ధి మాకు వదిలేయండి - సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కొత్తగూడెం-పాల్వంచ ఉమ్మడి పట్టణాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసేంతవరకు అవిశ్రాంత పోరాటం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేర్కొన్నారు. శనివారం ఉదయాన్నే పార్టీ శ్రేణులతో కలిసి 26 డివిజన్లో సీపీఐ అభ్యర్థి ఎర్రా లింగేష్ ను గెలిపించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సిపిఐ పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని అండదండలతో కార్పొరేట్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కొత్తగూడెం పట్టణంలో భవిష్యత్తు మంచినీటి సమస్య రాకుండా అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులతో పైప్ లైన్ పనులు పట్టణంలో మొదలయ్యాయని గుర్తు చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, విద్యావంతుడిగా, బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఎర్రా లింగేష్ ను గెలిపించి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లింగేష్ చదువుకునే రోజుల్లో రాత్రి సమయంలో ఆటో నడుపుతూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లి ఎంబీఏ చదువుకున్నాడని గుర్తు చేశారు. అలాంటి అభ్యర్థులు ప్రజా జీవితంలోకి రావడం శుభపరిణామం అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సారధ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి పరుగులు పెడుతుందని, కార్పొరేటర్లుగా సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవడం మన అందరీ బాధ్యతని అన్నారు. 26వ డివిజన్ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యవంతంగా ఆలోచించి సిపిఐ అభ్యర్థి లింగేష్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :