తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. వెంకట్యాతండాకు చెందిన తులికశ్రీకి, సీతారాంపురానికి చెందిన బిచ్చాతో వివాహం నిశ్చయమైంది. ఇటీవల భద్రాచలం వెళ్లొచ్చాక బిచ్చా వేధించడంతో మనస్తాపం చెందింది. దీంతో యువతి 13న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ