తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 7 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆరోగ్య కేంద్రంలోని మహిళా ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో బతుకమ్మ కార్యక్రమాలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, సిహెచ్ఓ రామకృష్ణ, హెచ్ ఎన్ వరలక్ష్మి బాయ్, హెచ్ వి ప్రియదర్శిని, రాధిక, ఏఎన్ఎం లు, ఆశాలు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ