తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండలంలోని మొత్తం 36 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా S.I.R. ప్రక్రియకు ముందు మండలంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 28,227గా ఉండగా, S.I.R.లో భాగంగా చనిపోయిన వారు, గ్రామం వదిలి వెళ్లిన వారు, డబుల్ ఓటర్లను గుర్తించి మొత్తం 2,499 మంది ఓటర్ల పేర్లను తొలగించారు.దీంతో ప్రస్తుతం జూలూరుపాడు మండలంలో 25,728 మంది నికర ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు అవకాశం.ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు ఉన్నవారు ఆగస్టు 17, 2026 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం BLOలను సంప్రదించడంతో పాటు, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఫారం-6, ఫారం-7, ఫారం-8లను సమర్పించవచ్చని పేర్కొన్నారు.ప్రజలు ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, తమ పేర్లు, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు దాఖలు చేసుకోవాలని జూలూరుపాడు తాసిల్దార్ టీ. శ్రీనివాసరావు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ