Thursday, 17 September 2026 12:53:17 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తాం , సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్.

Date : 10 July 2025 08:43 PM Views : 882

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి జూలై 10 (తెలుగు వెలుగు) సోలార్ ప్లాంట్లు మొదటి, రెండవ దశ లో చేపట్టిన నిర్మాణాలను అక్టోబర్ లోపు పూర్తి చేయాలి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ పనులను ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆదేశం సోలార్ ప్లాంట్ల నిర్మాణాలపై జరిపిన సమీక్షలో సింగరేణి ఛైర్మన్సింగరేణి భవన్, జులై 10, 2025రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను ఒప్పందంలో పేర్కొన్న కాల పరిమితికి లోబడి పూర్తి చేయాలని, నిర్మాణ పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ హెచ్చరించారు .హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులు మరియు సంబధిత కాంట్రాక్టర్లతో ప్రత్యేకించి సమీక్షించారు. మొదటి దశలో ఇంకా పూర్తి చేయాల్సి ఉన్న 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండవ దశలో పూర్తి చేయాల్సి ఉన్న 67.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ పై ఆయన నిశితంగా సమీక్షించారు. ఈ నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకుండా, తీవ్ర జాప్యం చేస్తున్న నిర్మాణ ఏజెన్సీలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లుల చెల్లింపుల విషయంలో సింగరేణి సంస్థ నుంచి ఎటువంటి జాప్యం లేనప్పటికీ నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా సరే ఇచ్చిన పనులను అక్టోబర్ నెల నాటికి వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేశారు. నిర్మాణ ఏజెన్సీలకు ఇదే చివరి అవకాశంగా భావించాలని,నిర్మాణాలను అక్టోబర్ కల్లా పూర్తి చేయనట్లయితే సదరు ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని, పనుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన వారిని కంపెనీలో బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించారు. నిర్మాణ పనులను అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయడానికి సింగరేణి సోలార్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల ప‌నుల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలో పూర్తి చేయించ‌క‌పోతే సంబంధిత అధికారుల ప‌నితీరును వారి స‌ర్వీస్ రికార్డుల‌తో న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బి.ఇ.ఎస్.ఎస్) వ్యవస్థ పనులను కూడా ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు కాగా కేంద్ర ప్రభుత్వ సూర్య ఘర్ యోజన పథకం కింద సింగరేణిలో వివిధ భవనాలపై చేపట్టిన 32.75 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్ల నిర్మాణపు పనులన్నీ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి. సత్యనారాయణ రావు, ఈడీ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని, జనరల్ మేనేజర్ (సోలార్) బి.సీతారామం, జనరల్ మేనేజర్ (వర్క్ షాప్) ఫ్రిజరాల్డ్, పీపీడీ(హెచ్‌వోడీ) విశ్వ‌నాథ‌రాజు, సంబంధిత ఏరియా ఇంజినీర్లు, సోలార్ ప్లాంట్ల ఇంజినీర్లు, వర్క్ షాప్ ఇంజినీర్లు మరియు వివిధ కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :