Thursday, 17 September 2026 06:10:16 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

నవభారత నిర్మాణం కోసం కృషిచేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.దిగ్విజయంగా యూనిటీ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 15 November 2025 08:09 PM Views : 348

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.దిగ్విజయంగా యూనిటీ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన....జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు పయనించాలని అలాగే ఈరోజు జన్జాతీయ గౌరవ దివస్, బిర్సా ముండ జయంతి జరుపుకోవడం కూడా గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్ ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఖమ్మం సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్దార్ వల్లభాయ్ పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి, ఐక్యత పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రతి పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని, దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిచే ఐక్యత(ఆత్మ నిర్భర్భారత్) ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేరా యువభారత్ ఖమ్మం జిల్లా అకౌంట్స్ అధికారి కె. భాను చందర్ మాట్లాడుతూ యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ 2025 అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించబడే ఒక కార్యక్రమం అని అన్నారు. ఈ మార్చ్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని జరుపుకుంటూ దేశ ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు. ప్రతీ జిల్లా వ్యాప్తంగా యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందనీ దీనిలో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి.షేక్ అబ్దుల్ రెహ్మాన్, డి.వై.స్.ఓ పరంధామ రెడ్డి, ఎన్.సి.సి నయీబ్ సుబేదార్ లక్ష్మణ్, జిల్లా ఎన్.ఎస్.ఎస్ కన్వీనర్ డా.వేముల కామేశ్వరరావు, ఇడి కాలేజీ ప్రిన్సిపాల్ పి.పద్మ, మేరా యువభారత్ ఖమ్మం జిల్లా ఎకౌంట్స్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్ కె. భాను చందర్, కన్వీనర్ పి.భిక్షపతి,కో-కన్వీనర్ బి.గోపికృష్ణ, బి.ప్రభాకర్ రెడ్డి మరియు జాగృతి యూత్ అసోసియేషన్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్ మరియు మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సుమారు 1000 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :