తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడుకుంటాం.సర్వే నెంబర్ల సమస్యకు త్వరలో పరిష్కారం.కూనంనేని కృషితో ప్రారంభమైన సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి.విద్యుత్ ప్లాంట్లు, స్పాంజ్ ఐరన్ కర్మాగారం సాధించేవరకు విశ్రమించం.చైతన్య యాత్రల సాక్షిగా కేంద్రం ఒంటెద్దు పోకడలను అడ్డుకుంటాం.అటవీహక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోభోం.పోడుసాగుదారులకు పెండింగ్ పోడు పట్టాలు అందించండి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.మూడో రోజూ..అదేజోరు.పాల్వంచ 'అర్బన్-రూరల్'లో హుషారుగా సిపిఐ ప్రజాచైతన్య యాత్రలు. పాల్వంచ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు, ఈ ప్రాంత జనసమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా స్పష్టం చేశారు. 'బద్లావ్ జరూరి హై' నినాదంతో సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు మూడోరోజు పాల్వంచ రూరం, పాల్వంచ అర్బన్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ఉత్సాహంగా జరిగింది. పినపాక పట్టణగర్ మీదుగా కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ రూరల్ మండలంలో రంగాపురం గ్రామానికి ప్రవేశించిన చైతన్య యాత్ర బృందానికి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పరిధిలో భద్రాచలం రోడ్ నుండి బస్టాండ్ మీదగా రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్, శాస్త్రి మార్కెట్ వరకు భారీ ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని అనంతరం శాస్త్రిబొమ్మ వద్ద జరిగిన బహిరంగ సభలో SK సాబీర్ పాషా మాట్లాడుతూ.. పాల్వంచ పట్టణంలోని సర్వే నెంబర్లు 444, 999, 817, 727, 410లలోని స్థలాలను క్రమబద్దీకరించాలని సుదీర్ఘ కాలంగా సిపిఐ పోరాటాలు నిర్వహించడంతోపాటు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ, కృషితో దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించబోతోందని, అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను ప్రారంభించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా సర్వే పూర్తి చేసి అర్హులందరికీ పట్టాలు అందించాలని కోరారు. అదేవిధంగా పాల్వంచ కేటీపీఎస్ పరిధిలో 800x2 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రాలను తక్షణమే నిర్మించాలని, మూతపడిన స్పాంజి ఉక్కు కర్మాగారాన్ని పునప్రారంభించి పాల్వంచకు పూర్వవైభవం తెచ్చేదుంకు సిపిఐ కృషి చేస్తుందన్నారు. గిరిజన, గిరిజనేతర పేదలు సాగు చేసుకుంటున్న పెండింగ్ పోడు భూములకు వెంటనే పట్టాలు అందజేయాలన్నారు. అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాలు కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని ఈ చట్టాలని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను పోరాటాల ద్వారా తిప్పికొడతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో మిళితమైన భద్రాద్రి జిల్లా సమగ్ర వికాసంపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి అదానీ, అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతూ మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ సిపిఐ చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ఇదే స్పూర్తితో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి కేంద్రానికి వణుకుపుట్టిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం మేయర్ మూడ్ గణేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, సర్ రెడ్డి పుల్లారెడ్డి, అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, మున్నా లక్ష్మీకుమారి, కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, SK ఫహీం, మువ్వ వెంకటేశ్వర్లు, భూక్యా దసురు, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం, వెంకటేశ్వర్లు, నామ కీర్తి, నూనావత్ శ్యామల, గొర్లె అన్నపూర్ణ, జిల్లా సమితి సభ్యులు అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, భూక్యా శ్రీనివాస్, వీ పద్మజ, రత్నకుమారి సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ