తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 6 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారి ప్రెస్ క్ల బ్ నందు భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ రవి ముఖ్య అతిథిగా వచ్చారు. వారు మాట్లాడుతూ మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మండల ప్రజలంతా స్వామివారి కళ్యాణం లో భాగంగా శోభాయాత్రలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎటువంటి అసంఘటిత జరగకుండా ఉండేందుకు అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ