తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయ ఆవరణలో జిల్లా గ్రంథాలయ నూతన కార్యదర్శి కే కరుణ కుమారి గురువారం మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే గ్రంథాలయావరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కని నాటడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అడవులు అంతరించిపోయి వాతావరణ సమతుల్యతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని విరివిగా మొక్కలను నాటడం ద్వారా రాబోయే తరాలకు మేలు జరుగుతుందని చెప్పారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ తలా ఒక మొక్కను నాటాలని సూచించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు సిబ్బంది మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జి m. నవీన్ కుమార్, గ్రంథ పాలకురాలు జి. మణిమృదుల, రీటైడ్ ఉద్యోగి కోటేశ్వర రావు విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠకులు పాల్గన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ