తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ నవరాత్రుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ సందర్బంగా గోదావరి నది కరకట్ట వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.అక్కడ ఉన్న అధికారులకు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గోదావరి నదీ ప్రవాహాన్ని వీక్షించేందుకు కరకట్ట మీదకు ఎవరూ రాకూడదని సూచించారు.ముఖ్యంగా రాత్రి సమయాల్లో కరకట్ట మీద ఎవరైనా సంచరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కరకట్ట పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలియజేశారు.నిమజ్జనోత్సవానికి గణేష్ ప్రతిమలను తీసుకొని వచ్చే ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,భద్రాచలం సీఐ నాగరాజు మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ