తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ ఒత్తిడికి తలొగ్గి కార్మికుల కీలక డిమాండ్లకు ఏ ఎల్ సి సమక్షంలో అంగీకారం. పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి..పలు ప్రధాన డిమాండ్లపై కీలక అగ్రిమెంట్లు–కార్మికుల హక్కుల సాధనలో మరో ముందడుగు. చరిత్ర తిరగరాసిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయంపై కార్మికుల్లో హర్షం..ఏఐటీయూసీ నాయకత్వానికి అభినందనల వెల్లువ. వీకే కోల్ మైన్ నందు గేట్ మీటింగ్ లో వివరాలు వెల్లడించిన ఏఐటీయూసీ నాయకులు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ చేపట్టిన పోరాటానికి మరో కీలక విజయం లభించిందని నాయకులు తెలిపారు.జూన్ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, నిరంతర ఒత్తిడి ఫలితంగా సింగరేణి యాజమాన్యం పలు డిమాండ్లపై అంగీకరించిందన్నారు .పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే భరించడం, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహణ, 149 మంది మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు ఆఫీస్ ఆర్డర్లు, సీనియర్ మైనింగ్ స్టాఫ్‌కు ప్రమోషన్లు వంటి అంశాలపై అంగీకారాలు సాధించామని తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సింగరేణి విద్యాసంస్థల్లో సి బి ఎస్ ఈ సిలబస్, కాంట్రాక్ట్ కార్మికులకు ఈ ఎస్ ఐ వైద్య సదుపాయం, సేఫ్టీ మెటీరియల్, సర్ఫేస్ ఉద్యోగాలు, సొంత ఇంటి పథకం తదితర అంశాలపై కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించాలని, సంస్థపై రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వీకే కోల్ మైన్ వద్ద శనివారం ఉదయం బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి పాల్గొని ప్రసంగించారు..సాధించిన అగ్రిమెంట్లు కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ నిరంతర పోరాటానికి నిదర్శనమన్నారు.మిగిలిన సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఏఐటీయూసీ సాధించిన విజయాలపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కత్తెర్ల రాములు, వీకే కోల్ మైన్ పిట్ కార్యదర్శి ఏం ఆర్ కే ప్రసాద్,ఆఫీస్ బ్యారర్స్ హీరాలాల్,కుర్ర రమేష్,మెంగన్ రవి,ప్రభాకర్,కోటి,ఓదెలు,రాజారత్నం,లక్ష్మీనారాయణ, సోములు,తిరుమలరావు,రమేష్, ఏసుపదం, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ