Friday, 18 September 2026 09:48:26 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

Date : 04 June 2026 06:59 PM Views : 400

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి.సమస్యల పరిష్కారం చూపని గ్రామసభలు ఎందుకు.16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. ప్రజా సమస్యల పరిష్కార మార్గంగా గ్రామసభలు ఉండాలని, పరిష్కార మార్గం చూపని గ్రామసభలు ఎందుకని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులను ప్రశ్నించారు. 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆమె మాట్లాడుతూ గత గ్రామ సభలో తీసుకున్న సమస్యల కు సంబంధించి ఎంతవరకు పరిష్కారం చూపారో ప్రజలకు తెలపాలని ఆమె అధికారులకు ప్రశ్నించారు. గత ప్రజాపాలన గ్రామసభలో సామాజిక పింఛన్లు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రెండవ తారీఖున సామాజిక కొత్త పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రజలు ఎదురు చూశారని, ఎందుకు పెన్షన్ల పంపిణీ చేయలే దో ప్రజలకు వివరించాలని ఆమె అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ గృహ పథకం రామవారానికి వర్తింప చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె విమర్శించారు. రామవరం ప్రాంత ప్రజలకు సొంత స్థలం ఉంది అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. డివిజన్ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా శానిటేషన్ పట్ల శ్రద్ధ తీసుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే తడి చెత్త ,పొడి చెత్త ఇతర రకాల పదార్థాలను వేరు చేయడంలో 16 వ డివిజన్ ప్రజలు చైతన్యవంతమై ఉన్నారని ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. అదేవిధంగా రామవరం లో ఇంకుడు గుంటలు కూడా ప్రజలు సహకరించవలసినటువంటి అవసరం ఉందని ప్రజలకు తెలిపారు. అకాల వర్షం కారణంగా గ్రామ సభకు అవాంతరం కలిగినప్పటికీ వర్షంలో కూడా గ్రామ సభకు సహకరించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ రాజు మారకద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. అనంతరం వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావలసిన పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లులు తదితర పథకాలను ప్రజలకు చేరవేటంలో ప్రభుత్వ ఉత్తర్వుల అనుసరించి అర్హులైన పేద వారందరికీ సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శివరాం, రామయ్య ,జవాన్ లక్ష్మణ్ ,ఆర్పీలు జానకి, కవిత ,ఏఎన్ఎం కవిత, తార ,శానిటేషన్ వర్కర్స్ శాంత, సందీప్ ,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :