తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్ టి సి బస్సు స్టాండ్ వద్ద బీ హెచ్ ఇ ఎల్ ఆర్టీసీ డిపో బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆయన భార్య స్వల్ప గాయ్యాలయ్యాయి. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు స్టాండ్ నుండి బస్సు భద్రాచలం వైపు వెళ్తుండగా ఆటో దిగి వస్తున్న లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ కు చెందిన భట్టు సుభాష్ చంద్ర బోస్ (35),ను బస్సు ఢీ కొట్టింది అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఆయన భార్య లలిత కింద పడటం తో గాయాలయ్యాయి. బస్సు ను స్టేషన్ కు తరలించి మృతదేహాన్ని ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ