Friday, 18 September 2026 01:34:59 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు.

Date : 13 July 2026 07:01 PM Views : 754

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదకద్రవ్యాల నిర్మూలనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల కఠిన చర్యలు.గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు.మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు, గంజాయి వినియోగం, విక్రయం, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతువాగు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి కేసు నమోదు చేశారు.గంజాయి వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించి, భవిష్యత్తులో మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, "మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసులు రాజీ పడే ప్రసక్తే లేదని, యువత భవిష్యత్తును కాపాడడం కోసం ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి" అని హెచ్చరించారు.ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీల్లో చుంచుపల్లి సీఐ ఆర్ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :