Thursday, 02 July 2026 05:28:50 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

భద్రాద్రిలో వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం. ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తజనం. వైకుంఠ రాముడిగా అనుగ్రహించిన భద్రాద్రి రామయ్య.

Date : 30 December 2025 07:56 PM Views : 373

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవోపేతంగా, భక్తుల హృదయాలను ఉప్పొంగించేలా ఘనంగా నిర్వహించబడ్డాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వైకుంఠ రాముడిగా అలంకరించబడిన స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరవశించి, శ్రీ రామ జయ రామ జయ జయ రామ అనే జయజయధ్వానాలతో భద్రాద్రి క్షేత్రం మారుమోగింది.ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన వివిధ సెక్టార్లలో భక్తులు శాంతియుతంగా వేడుకలను తిలకించారు. వేదపండితులు, స్థానాచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా, అర్చకులు 108 ఒత్తులతో మహా హారతి నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం అనంతరం ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో భక్తిశ్రద్ధల మధ్య ఊరేగించారు.ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనరూపుడిగా శ్రీమహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు విశేష ఆరాధనలు, శ్రీరామ పదాక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద పఠనం, గరుడ ప్రబంధాలు, ఇతిహాస పఠనం, శరణాగతి గజ్జగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతక పఠనం నిర్వహించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శత హారతిని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తరామదాసు కాలం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ మూలవిరాట్టులకు స్నపన కార్యక్రమం నిర్వహించారు.ఉత్తర ద్వార దర్శనం అనంతరం వైకుంఠరాముడు తిరువీధి సేవకు బయలుదేరారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అండాళ్ అమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీ సీతారామచంద్రమూర్తుల తిరువీధి సేవ మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణల మధ్య శోభాయమానంగా సాగింది. రాపత్తు ఉత్సవాలతో వేడుకలు మరింత వైభవాన్ని సంతరించుకున్నాయి.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ప్రతి సెక్టార్‌లో ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారులు, లైజన్ అధికారులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ వేడుకకు భద్రాచలం, శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్ రావు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐ టి డి ఏ పి ఓ రాహుల్, ట్రైనీ కలెక్టర్ సొరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ దొర తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయగలిగామని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, భక్తులకు, పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :