Wednesday, 16 September 2026 03:29:30 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

యూనియన్ కొమురయ్య భవన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక క్షేత్రాల్లో కొమురయ్యకు ఘన నివాళులు

Date : 05 September 2025 07:45 PM Views : 744

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య వర్ధంతి సందర్భంగా నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్‌మెంట్లలో యూనియన్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు ఘన నివాళులర్పించారు. రుద్రంపూర్‌లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ కొమురయ్య భవన్ ను కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కామ్రేడ్ కునంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు మాట్లాడుతూ, అమరజీవి యూనియన్ కొమురయ్య కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టులపై తీవ్ర నిర్బంధాలు, కనిపించిన వెంటనే కాల్చివేతలు ఉన్న రోజుల్లో కూడా, మనుబోతుల కొమురయ్య శ్రమదోపిడీకి గురవుతున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల దీన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేశారు. అందుకే, వారి కోసం 1940లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ను స్థాపించి ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించారని అన్నారు. అనాడు కమ్యూనిస్టు నాయకులైన దేవూరి శేషగిరి రావు, మక్దుం మొయినుద్దీన్, రాజ్ బహద్దూర్ గౌర్, కె.ఎల్. మహేంద్ర వంటి యోధులతో కలిసి అనేక పోరాటాలు చేసి, కార్మికుల కోసం ప్రభుత్వంతో పోరాడి అనేక చట్టాలు సాధించారని తెలిపారు. చట్టాలపై పూర్తి అవగాహనతో వాటిని అమలుపరిచే విధంగా పోరాడేవారని కొనియాడారు. కొమురయ్య ఒక్క పిలుపు ఇస్తే బొగ్గుబాయిల నుండి ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాకుండా కార్మికులు సమ్మె చేసి సమస్యలను పరిష్కరించుకునేవారని అన్నారు. నిజాం పాలన విముక్తి కోసం పోరాడిన ఆయనను కాల్చివేయడానికి నిజాం సైన్యం గాలిచిందని, అయినప్పటికీ తన జీవితమంతా కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ బొగ్గుగని కార్మికుల హక్కుల కోసం ధారపోసిన మహానాయకుడు కొమురయ్య అని ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పంచుకున్నారు. తాను కూడా ఆయనతో కలిసి అనేక పోరాటాలలో పనిచేసిన అనుభవాలను కార్మికులతో పంచుకున్నారు. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, కొమురయ్య కార్మిక సంఘానికి సుమారు 40 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఉండి అనేక హక్కులు సాధించారని తెలిపారు. వేతన కమిటీలో శాశ్వత సభ్యుడిగా ఉండి కార్మికులకు మెరుగైన జీతాలు, సౌకర్యాల కోసం పోరాడి సాధించారని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన తరువాత ఎటువంటి ఆధారం లేని సింగరేణి కార్మికులకు పెన్షన్ సాధించారని, కోల్‌ఇండియా కార్మికుల కంటే సింగరేణి కార్మికులకు రఘురామరెడ్డి అవార్డు ద్వారా అదనంగా ఒక ఇంక్రిమెంట్‌ను ఇప్పించారని గుర్తుచేశారు. కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ హోదా కల్పించిన మహానాయకుడు కొమురయ్య అని అన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, సింగరేణిలో నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులు అన్నీ తమ సంఘం ఏఐటీయూసీ నాయకులు పోరాడి, ప్రాణత్యాగాలు చేసి సాధించినవేనని తెలిపారు. కొమురయ్య కృషి సింగరేణి ఉన్నంత కాలం కార్మికుల గుండెల్లో పదిలంగా ఉంటుందని, ఒక సామాన్య ఉద్యోగి (టర్నర్)గా మెయిన్ వర్క్‌షాప్‌లో చేరి, కార్మికుల కష్టాలను చూసి చలించిపోయి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ప్రభుత్వాలతో, యాజమాన్యంతో కొట్లాడి అనేక ఉద్యమాలు చేసి హక్కులు సాధించారని పేర్కొన్నారు. చివరికి ఆరోగ్యం బాగోకపోయినా నిరాహార దీక్షకు సిద్ధపడి తుదిశ్వాస విడిచారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా మాట్లాడుతూ, పీడిత ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేయడం కమ్యూనిస్టుల గొప్పదనం అని ప్రజా పోరాటాలకు కమ్యునిజం ఊపిరిలాంటిది అని ఎందరో మహోన్నత నాయకులను, కార్మిక నాయకులను సమాజానికి అందించిన పార్టీ భారత కమ్యునిస్టు పార్టీ అని అన్నారు. ఒక కమ్యూనిస్టు నేతగా , కార్మిక నాయకుడిగా కార్మికుల కోసం నిరంతరం పోరాడిన అమరజీవి కొమురయ్య మరణించినప్పటికీ కార్మికుల గుండెల్లో పదిలంగా ఉన్నారని అన్నారు. అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ కార్మిక వర్గ ఉద్యమాల్లో అనాడు కొమురయ్య గారితో కలిసి పాల్గొన్న విషయాన్ని తెలిపారు. కార్మికుల హక్కుల సాధనలో తిరుగులేని నాయకుడు కొమురయ్యని తెలిపారు. బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణ మూర్తి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాస్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య,సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్,కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ కతర్ల రాములు, శేషగిరి రావు, సందేబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వర రావు, గుమ్మడి వీరయ్య, హీరాలాల్, పీవీకే పిట్ కార్యదర్శి హుమాయూన్, వర్క్‌షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఏరియా స్టోర్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ కమల్, జీకేఓసీ ఇన్‌ఛార్జి పిట్ కార్యదర్శి ఎం.ఆర్.కే. ప్రసాద్, ఆర్‌సీహెచ్‌పీ సహాయ పిట్ కార్యదర్శి సురేందర్ తదితర కార్మిక సంఘం నాయకులు, సత్తుపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమయ్య, నాయకులు బ్రాంచ్ సహాయ నాయకులు సూర్యప్రకాశ్, జాయింట్ కార్యదర్శి భరణి, జె వి ఆర్ ఒక పిట్ కార్యదర్శి నరసింహ రావు,kistaram ఓసీ పిట్ కార్యదర్శి కిషోర్ కుమార్, కార్మికులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :