Wednesday, 16 September 2026 08:14:18 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెంలో విస్తృతంగా పంద్రాగస్టు వేడుకలు పాల్గొన్న కంచర్ల చంద్రశేఖర్, నాగ సీతారాములు...

Date : 15 August 2024 03:20 PM Views : 443

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం- ఆగస్టు 15. (తెలుగు వెలుగు) భారత స్వాతంత్ర పోరాటంలో వీరుల పోరాట సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కొత్తగూడెంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన జెండావిష్కరణ వేడుకల్లో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ప్రయాణం అపారమైన త్యాగం, ధైర్యం, ఐక్యతతో నిండిన మార్గంలో సాగిందన్నారు. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు స్వాతంత్ర్య సమరయోధులు, భారతీయ ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, అయినా సరే వారు వెనక్కి తగ్గకుండా పరాయి పాలన నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ దేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి వారు ఎన్నో కష్టాలు పడ్డారని మరెన్నో త్యాగాలు చేశారన్నారు. మన స్వాతంత్ర్య కోసం పోరాడిన ఎంతోమంది ధైర్యవంతుల కారణంగానే మనం ఈనాడు స్వేచ్ఛగా ఉన్నామని భగత్ సింగ్, రాణీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది వీరులు తమ జీవితాలను మన దేశ స్వాతంత్ర్య కోసం అంకితం చేశారని వారి సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మన దేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలిసిన భూమి. అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నామని, మన ఐక్యతే మనకు బలమని, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందామని, మహాత్మా గాంధీ మనకు అహింసా, సత్యానికి ఉన్న శక్తిని బోధించారు. కాబట్టి అహింసా, సత్యాన్ని వీడకుండా శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మన వంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందనీ అయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ళ మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా,మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :