Thursday, 17 September 2026 11:52:55 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

వృత్తి విద్య శిక్షణను ఆర్థిక సంవత్సరం 2024-25 లో పూర్తి చేసిన మహిళలకు రాత పరీక్ష

Date : 18 September 2025 06:30 PM Views : 1877

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సేవా సమితి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ మొదలగు వృత్తి విద్య శిక్షణను ఆర్థిక సంవత్సరం 2024-25 లో పూర్తి చేసిన మహిళలకు రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు జి.మధురవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న ఉచిత స్వయం ఉపాధి శిక్షణను పొందిన మహిళలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఉండాలని అలాగే నిరుద్యోగతను తగ్గించుటకు మహిళలకు, గృహిణులకు ఈ అవకాశం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మరియు ఈ వృత్తి శిక్షణను నేర్చుకున్న మహిళలు తమ ద్వారా ఇతరులకు జీవనోపాధి కల్పించే విధంగా ఉండాలని తెలియజేశారు. కొత్తగూడెం ఏరియా లోని రామవరం, గౌతంపూర్, రుద్రంపూర్, ధన్బాద్ సేవ సెంటర్స్ లలో టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటిషన్ కోర్సులలో వృత్తి శిక్షణను పొందిన మొత్తం 108 మంది మహిళలకు ఉదయం 10.00గంటలకు సి.ఈ.ఆర్ క్లబ్, రుద్రంపూర్ నందు రాత పరీక్ష నిర్వహించగా 99 మంది హాజరు కావడం జరిగింది మరియు సత్తుపల్లి లోని శిక్షణను పొందిన మొత్తం 90 మంది మహిళలకు సాయంత్రం 03.30 గంటలకు షాపింగ్ కాంప్లెక్స్ పి.వి. నరసింహా రావు కాలనీ నందు రాత పరీక్ష నిర్వహించడం జరిగింది మరియు 2023-24 బ్యాచ్ అభ్యర్థులకు పాస్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహణ హైదరాబాద్ నుండి వచ్చిన సెంట్రల్ కో ఆర్డినేటర్ డి. శివ కుమార్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు తో పాటు, పద్మజా కోటి రెడ్డి గారు, లేడీస్ క్లబ్ సెక్రటరీ సునీత, సత్తుపల్లి లేడీస్ క్లబ్ సెక్రటరీ ఎన్. ఉషశ్రీ ప్రహ్లాద్, కొత్తగూడెం ఏరియా సేవ కో-ఆర్డినేటర్ సిహెచ్.సాగర్, సేవా సెక్రటరీ వై. అనిత, ఇతర వృత్తి శిక్షణ ఇచ్చు అధ్యాపకులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :