తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యారంగంలో విశిష్ట సేవలకు శిక్షారత్న అవార్డు 2026.. కృష్ణవేణి కళాశాల డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు కి హరి యూనివర్సిటీ హైదరాబాద్ వారిచే అవార్డు ప్రదానం ఆదివారం అనగా 06-09-2026, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హరి యూనివర్సిటీ హైదరాబాద్ వారు దశాబ్ద కాలంగా విద్యారంగం లో విశిష్ట సేవలను కొనసాగిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కు బాటలు వేస్తున్న కృష్ణవేణి కళాశాల డైరెక్టర్ శ్రీ మాచవరపు కోటేశ్వరరావు కి శిక్షారత్న అవార్డు ను యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ యం. నర్సిరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి అందజేశారు. విద్యారంగంలో కృష్ణవేణి విద్యాసంస్థలు కొనసాగిస్తున్న సేవలు అమూల్యమైనవని అందులో శ్రీ కోటేశ్వరరావు పాత్ర విశిష్ట మైనదని పలువురు వక్తలు కొనియాడారు. విద్య తో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు విద్యార్ధులలో పెంపొందించి, వారిలోని ప్రతిభను వెలికి తీయడంలో శ్రీ కోటేశ్వరరావు పాత్ర అందరికీ ఆదర్శ ప్రాయమైనదని అన్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో విద్యా ప్రమాణాల పెంపుదలకు కృష్ణవేణి విద్యాసంస్థలు చేస్తున్న సేవలు విశేషమని కార్యక్రమాల్లో పలువు వక్తలు పేర్కొన్నారు గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో కోటేశ్వరరావు కీలక పాత్ర పోషించారని తెలిపారు విద్యార్ధుల్లో పోటీ పరీక్షల పట్ల అవగాహన పెంపొందించడంతో బాటు ఉన్నత విద్యకు మార్గదర్శనం చేస్తూ అనేక మంది యువతను ఉన్నత స్థానాలకు చేర్చడంలో ఆయన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.అవార్డు స్వీకరించిన తరువాత శ్రీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ అవార్డు కృష్ణవేణి విద్యాసంస్థల సమిష్టి కృషి ఫలితమని ఇది తనకు వ్యక్తి గత గౌరవం కాదని అన్నారు. సమాజంలో మిక్కిలి గౌరవించదగిన వాడు గురువని, ఉత్తమమైన గురువు లేనిదే సమాజం వివిధ రంగాలలో రాణించచదని, గురువుచే సంస్కరింపబడిన జాతి గొప్పదని అన్నారు. విద్యార్థులు వివిధ రంగాలలో సాదిస్తున్న విజయాలే మాకు గొప్ప అవార్డులని అన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, విద్యారంగంలో మున్ముందుకు కొనసాగుతామని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి- త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్లు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, గొల్లపూడి జగదీశ్, గొల్లపూడి వీరేంద్ర చౌదరి అభినందించారు. మరియు కృష్ణవేణి కళాశాల డీన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక అధ్యాపకేతర బృందము, విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పుర ప్రముఖులు శ్రీ కోటేశ్వరరావు కి అభినందనలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ