Thursday, 17 September 2026 11:56:53 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు చేపట్టాలి - ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు

Date : 29 August 2026 02:44 PM Views : 89

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నమగ్ర చర్యలు చేపట్టి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా అన్నారు. శనివారం సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు అనుముల సాయితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో సకాలంలో ప్రజాసేవలు ముందుకు సాగడం లేదన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోడం లేదని, ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ.4వేల నిరుద్యోగ బృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు వరం చేస్తూ నిరుద్యోగ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని, ఆ విధానాలు మానుకోవాలన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో స్థానిక యువత నిరుద్యోగ సమస్యను రూపు మాపాలాన్నారు. పేద నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఉచిత కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటితో పాటు ఆన్లైన్ బెట్టింగులకు యువత బానిసలువుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనిపై సంబంధిత శాఖలు కఠినంగా వ్యవహరించాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. నిరుద్యోగం విద్య ఉపాధి సమస్యలపై నిరంతర పోటాలు సాగిస్తామని చెప్పారు. అనంతరం పలు తీర్మాణాలను జిల్లా కమిటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆమోదించారు. ఈ విలేకరుల సమావేశంలో సాధనపల్లి సతీష్ ఎన్కే ఖయ్యూమ్ భూపేష్ ఎండి నాదీమ్ రవికిరణ్ కొచ్చర్ల రాకేష్ నలిగంటి నవీన్ అజయ్ రసూల్ అమీర్ మాణిక్యాల వినయ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :