Sunday, 02 August 2026 01:12:41 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఎఐటియుసినే.

Date : 10 July 2026 07:35 PM Views : 92

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఎఐటియుసినే.సమ్మె నోటీసుపై కీలక పురోగతి – ఈ నెల 15న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో మరోసారి చర్చలు. శేషగిరి భవన్‌లో విలేకరుల సమావేశంలో ఎఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ వెల్లడి.తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఎఐటియుసినేనని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ 2013లోనే సచివాలయాన్ని ముట్టడించి అరెస్టులకు గురైన ఘనత ఎఐటియుసిదేనని అన్నారు. ప్రస్తుతం తాడిచర్ల-2 బ్లాక్‌తో పాటు మిగిలిన బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ఉపాధి భద్రత కోసం ఇది అవసరమని పేర్కొన్నారు.సమ్మె నోటీసుకు సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుందని, ఈ నెల 15న రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని తెలిపారు. చర్చలు విఫలమై ఆర్‌ఎల్‌సీ ఫెయిల్యూర్ రిపోర్ట్ జారీ చేస్తే ఆగస్టులో సమ్మెకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ప్రతి కార్మికుడికి 40% వాటా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 56వేల కోట్ల రూపాయలు వసూలు చేసి సంస్థకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చి సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు,మరియుబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన "బయ బాట" కోసం మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు వారి పట్ల సానుభూతి చూపడం సమంజసం కాదన్నారు.సింగరేణి కార్మికుల సమస్యలను వారి కుటుంబ అవేదాలను అసెంబ్లీలో నిరంతరం ప్రస్తావించిన ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాత్రమేనని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కే. సారయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్ హుమాయూన్, నాయకులు ఎర్రగని కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, శ్రీను, సోమయ్య,తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :