Thursday, 17 September 2026 05:27:17 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 21 September 2024 06:10 PM Views : 673

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల సమయంలో,గణేష్ నవరాత్రులు,నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అంకితభావంతో అహర్నిశలు ప్రజలకు సేవలాందించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు.భవిష్యత్తులో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోనే విధంగా నమ్మకాన్ని కలిగించారని ప్రశంసించారు.కొత్త కొత్త టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారు.సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలకు అనునిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు.ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి "క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్" ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.గుట్కా,మట్కా,జూదం,బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని తెలిపారు.

రౌడీషీటర్లు మరియు పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు.జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ నివారణాచర్యలు చేపట్టాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అనంతరం గత నెలలో వర్టికల్స్ వారీగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు మరియు సీఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :