Thursday, 17 September 2026 08:31:45 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు, గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

Date : 02 August 2025 10:52 PM Views : 921

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో అభివృద్ధి సూచికలన్నింటినీ సమర్థంగా సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా రాజ్ భవన్‌లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలోరాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు అవార్డు ప్రధానం చేశారు. నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై 100 శాతం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఆరు సూచికలలో మూడు సూచికలపై శాతం సంపూర్ణత సాధించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాక, గుండాల మండలం బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలను విజయవంతంగా పూర్తి చేసి ఆకాంక్షిత బ్లాక్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ అధికారి బృందాలు చేసిన సమీక్షల ఆధారంగా జిల్లా స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం ను అవార్డు కోసం ఎంపిక చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గారు మాట్లాడుతూ... ఈ అవార్డు రావడం జిల్లాలోని అధికార యంత్రాంగం, మండల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది మరియు ప్రజల చొరవకు గుర్తింపుగా నిలిచింది అని అన్నారు. ప్రతి గ్రామానికీ అభివృద్ధి కల్పించాలన్న సంకల్పంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయి అని, ప్రతి సూచికపై కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ అవార్డు మాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అభివృద్ధిలో స్థిరత్వం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ముందుగానే ప్రణాళికలు రూపొందించి, సమర్థవంతంగా అమలు చేస్తే మరింత ప్రగతి సాధించవచ్చు అన్నారు. భవిష్యత్తులో జిల్లా మరిన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడేలా చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :