Wednesday, 04 November 2026 07:08:11 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

డిపిఆర్ టెండర్ రద్దు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ .

Date : 11 August 2026 04:33 PM Views : 170

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.9 కోట్ల 60 లక్షల డిపిఆర్ (DPR) టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని జైభీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.మంగళవారం జేబీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో యెర్రా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం డిపిఆర్ లో 9 కోట్ల 60 లక్షల విలువచేసే టెండర్ ను కేవలం మూడు రోజులు మాత్రమే సమయం కేటాయించి మూడు రోజుల్లోనే టెండర్ ఓపెన్ చేయడం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినప్పుడు వాటిని రద్దు చేసి మరల టెండర్ నిర్వహించాలని,కానీ అలా చేయకుండా మున్సిపల్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ ఓపెన్ చేశారని,నిబంధనలను తుంగలో త్రొక్కి టెండర్ ఓపెన్ చేసిన అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.9కోట్ల 60 లక్షల పనికి కనీసం 14 రోజుల గడువు ఇవ్వాలనే ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధనలు ఉన్నాయని అన్నారు. టెండర్ ప్రక్రియలో 8కోట్ల స్కామ్ జరిగే అవకాశం ఉందని అసలు 8కోట్ల స్కాంలో సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు??అధికారులు, తక్షణమే టెండర్ రద్దు చేయాలని,లేనియెడల కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి డిపిఆర్ టెండర్ రద్దు అయ్యేవరకు పోరాడుతామని,అవసరమైతే న్యాయస్థానానికైనా వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పట్టణ అధ్యక్షుడు గజ్జల శంకర్, వినయ్, సోను, మున్నా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :