Saturday, 19 September 2026 02:51:56 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 11 August 2025 12:44 PM Views : 490

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నులిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు – కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు . విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా, సోమవారం పాల్వంచ బొల్లారిగూడెం మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమమునకు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటేనే చదువులో పూర్తి స్థాయి దృష్టి పెట్టగలరని, అందుకే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రాధాన్యత వహిస్తోందని తెలిపారు. నులిపురుగులు శరీరంలో ఉండటం వలన పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, ఇవి వారి శారీరక ఎదుగుదల, చదువులో ఏకాగ్రత, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ సమస్యలను నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలు నులిపురుగులను పూర్తిగా నిర్మూలించడంలో, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 3,36,136 మంది పిల్లలు మరియు యువతకు ఈ మాత్రలు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, వసతి గృహం, అంగన్వాడీ కేంద్రం, కళాశాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నులిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో పాటు, ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని ప్రజలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు ఇవ్వాలని, 1–2 సంవత్సరాల వయసు పిల్లలకు సగం మాత్ర, 2–19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర నమిలి మింగేలా చేయాలని సూచించారు. ఆగస్టు 18 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరికి మాత్రలు అందించడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. నులిపురుగులు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన కారణమని, వాటి నివారణ ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా, చదువులో ప్రతిభ కనబరుస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధక సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :