తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వేచ్ఛను కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాల నివారణలో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ వేడుకల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ