Friday, 18 September 2026 01:05:36 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

బర్మా క్యాంపులో కార్మిక సంక్షేమ భవన్'కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Date : 29 July 2026 06:22 PM Views : 183

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రూ.59లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం రూ. 59 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ఎస్సిబి నగర్ 14వ డివిజన్, పాత కొత్తగూడెం 12వ డివిజన్లో, 10వ డివిజన్ బూడిదగడ్డలో, 58వ డివిజన్ హనుమాన్ బస్తీలో, 49వ డివిజన్ హనుమాన్ బస్తీలో చేపట్టే సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం 24వ డివిజన్ బర్మా క్యాంపు ఏరియాలో రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న కార్మిక సంక్షమ భవన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి పారుదల, సీసీ రోడ్ల సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ భవనాల నిర్మాణంతో ప్రజల రవాణా సౌకర్యాలు, వసతులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ అధికారులు పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా, పారదర్శకతతో నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత వ్యవధిలోనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. స్థానిక డివిజన్ల ప్రజలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ తగిన సూచనలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు కూరపాటి సుధాకర్, పొలమూరి ధనలక్ష్మి, బోయిన విజయ్ కుమార్, సుప్రియ, నాయకులు ఎస్ కె ఫహీమ్, భూక్యా శ్రీనివాస్, యూసుఫ్, గోపికృష్ణ, గుత్తుల శ్రీను, ఖయూమ్, మండల రాజు, రాజేందర్, వాడే రాములు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :