Wednesday, 16 September 2026 04:24:39 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ ఆధ్వర్యంలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగి

Date : 23 September 2025 08:06 PM Views : 422

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికులకు ఇవ్వాల్సిన న్యాయమైన నికర లాభం నుండి 34% ఇవ్వాలని వి కే సి ఎం పివికె 5 షాఫ్ట్, ఎస్ ఎన్ పి సి, ఆర్ సి హెచ్ పి, కిష్టారం ఓసి జేవిఆర్ఓసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు ఇచ్చే లాభాల్లో 75% పైగా కోత విధించారని ఆగ్రహం కాపు కృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో 34% ఇవ్వడం ఏమిటని సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహమే చేసింది.నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందనమండిపాటు*బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం.. కాంగ్రెస్ పాలనలో ఘోరమైన సంక్షోభం అంటూ ఫైర్నికర లాభాల్లో కోట్లలో 34% ను కార్మికులకు బోనస్ గా ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం పక్షాన కాపుకృష్ణ డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి కార్మికుల కడుపు మీద కొట్టి తీవ్ర నిరాశకు నెట్టారు. మొత్తం లాభం 6394 కోట్ల నుండి కాకుండా, 2360 కోట్ల నుండి బోనస్ చెల్లించడం దారుణం.పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను దారుణంగా మోసము చేశారు.మోసం చేసి, మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ చేసారు.లాభాల వాటలో నికర లాభం నుండి సుమారు 75% కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా సుమారు 5 లక్షలు వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాశలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.గతంలో కేసీఆర్‌ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారు.కాంగ్రెస్‌ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గం.గతేడాది సింగరేణి భవిష్యత్‌ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,289 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు 4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారు! గత సంవత్సరం 33% ఇవ్వగా మిగిలిన 67% ఈ సంవత్సరం ఇస్తానన్న 34 శాతం మిగిలిన 66% తో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక ఒకే సంవత్సరంలో సింగరేణి సంస్థ అభివృద్ధికి అని రెండుసార్లు అమౌంట్ ని ఉంచుతున్నారు.కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు?కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణం.కెసిఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకు పోయింది.కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారు.సమైక్య రాష్ట్రంలో 1998-99 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 11నుండి 16 శాతమే. అప్పుడున్న ప్రభుత్వాలు యూనియన్లు 12 సంవత్సరాల లో 6% మాత్రమే పెంచడం జరిగింది. కానీ టీబీజీకేఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16% నుండి 32 శాతం వరకు పెంచడం జరిగింది 10 సంవత్సరాలలో 16% పెంచడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నికర లాభం నుండి సింగరేణి సంస్థ అభివృద్ధి గాని దాదాపు నాలుగు వేల కోట్లు పక్కన పెట్టడం జరిగింది మరి కార్మికులకు ఇస్తున్న 34% ఇవ్వగా మిగిలిన 66% సింగరేణి సంస్థ అభివృద్ధికే కదా స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని.2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారు.లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్‌ కే దక్కుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే సింగరేణి కార్మికుల జీవితాల్లో చీకటి తొలగించాల్సిన ప్రభుత్వం చీకటి నింపే ప్రయత్నం చేస్తుంది.సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనిబి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభం లో 34% బోనస్ గా ప్రకటించాలని వచ్చిన నికర లాభం నుండి 34% ఇస్తే సుమారుగా ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల వరకు వస్తాయి. టీబీజీకేఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగా అన్ని మైన్స్ ల మీద అన్ని డిపార్ట్మెంటులలో అన్ని ఆఫీసులలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేయాటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపుకృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి టీబీజీకేఎస్. గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్.సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితం విజయకుమార్, ఫిట్ సెక్రటరీ కుమార్ రాజ్ కుమార్ అశోక్ వెంకటేశ్వర్లు శ్రీకాంత్ విద్యాసాగర్ రాజేష్ అనుదీప్ రాజేశ్వరరావు తిరుపతయ్య పిచ్చయ్య తదితర కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :