తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా - ఐడీఓసీ, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ అంకిత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ కార్యాలయం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా ప్రాంగణాల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా అధికారులు, సిబ్బంది దేశభక్తి భావంతో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ