Thursday, 17 September 2026 12:53:59 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రాజమండ్రి శిక్షణకు 11 సీట్లు - అవకాశాన్ని వినియోగించుకోవాలని వడ్రంగి/కార్పెంటర్ సంఘ పెద్దలకు సూచన : జిల్లా కలెక్టర్

Date : 07 November 2025 03:53 PM Views : 496

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, వడ్రంగి (కార్పెంటర్) సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు లభిస్తున్న అవకాశాలను వివరించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజమండ్రిలో ఈ సోమవారం నుండి ప్రారంభమయ్యే రెసిడెన్షియల్ ఫర్నిచర్ అసిస్టెంట్ శిక్షణ కోసం 11 సీట్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి శనివారం (రేపు) ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని S-20 గదిలో ఒరియంటేషన్ మరియు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు: ఒక్కొక్కరికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును జిల్లా యంత్రాంగం భరిస్తుందని, వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా ఆ సంస్థ ద్వారా కల్పించబడుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయ్యిన వెంటనే రూ. 15,000/- స్తాయిలో 6 నెలల అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని కూడా కల్పిస్తారని, అనంతరం 100% ప్లేస్మెంట్ అదే సంస్థలోనే కల్పిస్టారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో NSTI–FFSC ఆధ్వర్యంలో మొదటి విడతలో 8 మంది శిక్షణ పూర్తి చేసుకుని అప్రెంటిస్‌షిప్‌లో ఉన్నారని, రెండవ విడతలో 19 మంది అభ్యర్థులను గురువారం ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాజమండ్రి శిక్షణ కోసం ఇంకా 11 మందిని శనివారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వడ్రంగి/కార్పెంటర్ యువతతో పాటు ఆసక్తి ఉన్న ఇతర యువత కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :