తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అక్రమాలకు నిలయంగా మారిన పాల్వంచ తోగ్గుడెం క్వారీ నిర్వహణ దారులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల అండదండలతో క్వారీ నిర్వహకుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని ఆరోపించారు.రాజకీయ నాయకుల ఒత్తిడి,క్వారీ నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల మత్తుకు అలవాటు పడిన కొంతమంది అధికారులు నిద్ర నటిస్తూ పరోక్షంగా సహకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అనుమతులు పొందిన ప్రదేశంలో కాకుండా ప్రభుత్వ భూముల్లో,అటవీ భూముల్లో మైనింగ్ చేస్తూ,అనుమతికి మించి లోడింగ్ చేస్తూ వాహనాలను తరలిస్తున్నా ప్రజల,పశువుల ప్రాణాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.క్వారీ నిర్వాహకులు జరిమానా చెల్లించక పోవడంతో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రెంచ్ కొట్టించారు.కానీ క్వారీ నిర్వహణ,మైనింగ్ పనులు ఏ మాత్రం ఆగకుండా వేరే మార్గం గుండా రాత్రిళ్ళు కంకర తరలింపును యదేచ్చగా నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.జిల్లా అధికారులు వెంటనే స్పందించి అక్రమ మైనింగ్,రవాణా ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ