Monday, 03 August 2026 10:19:30 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 March 2026 03:51 PM Views : 233

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . సోమవారం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి వైద్య సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని లాబరేటరీలో నిర్వహిస్తున్న పరీక్షా విధానాన్ని పరిశీలించి, పరీక్షలు నాణ్యతగా నిర్వహించాలని సూచించారు. అలాగే మందుల గిడ్డంగిని తనిఖీ చేసి, అవసరమైన అన్ని రకాల ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఓపీకి ఎంతమంది రోగులు వస్తున్నారో తెలుసుకున్నారు. రక్త పరీక్ష కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల వివరాలు, అందుబాటులో ఉన్న టీకాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవల స్థితిగతులు, అవసరమైన ఔషధాల లభ్యతపై సమగ్రంగా ఆరా తీశారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ కుక్క కాటుకు గురైన ఒక బాలుడిని పరామర్శించి, అతనికి అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, ప్రజలకు సమర్థవంతమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో వైద్య సేవల మెరుగుదలకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీ లో మెడికల్ ఆఫీసర్ స్వప్న టిపిఎమ్ఓ ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :