తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొర్రేడు వాగుపై వంతెన నిర్మాణంతో హేమచంద్రాపురం గ్రామ రైతుల చిరకాల కల నెరవేరిందని కో-ఆపరేటివ్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ కూచిపూడి జగన్ అన్నారు. ఈ వంతెన ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం హేమచంద్రాపురంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ వంతెన నిర్మాణం వల్ల పరిసర గ్రామాల రైతుల కష్టాలు తీరుతాయని జగన్ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ