Wednesday, 04 November 2026 04:31:57 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

రియల్ హీరోకి గ్రీన్ సెల్యూట్ ప్రాణాలు కాపాడిన వీరుడి పేరిట మొక్క నాటిన 8 ఏళ్ల వనజీవి చౌహాన్.

Date : 03 October 2026 07:07 PM Views : 208

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొక్కలు నాటడం కేవలం పర్యావరణ పరిరక్షణే కాదు అది ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చే నిజమైన గౌరవం అని నిరూపించాడు 8 ఏళ్ల బాల ప్రకృతి ప్రేమికుడు వనజీవి విశ్వామిత్ర చౌహాన్.పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతగా వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత 1584 రోజులుగా క్రమం తప్పకుండా ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న ఈ చిన్నారి ప్రకృతి ప్రేమికుడు మరో స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.విద్యానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో అరుదైన తైవాన్ మామిడి మొక్కను నాటాడు. ఈ మొక్కను ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో 180 మంది ప్రయాణికుల ప్రాణాలను తన ధైర్యసాహసాలతో కాపాడిన రియల్ హీరో స్మిత్ మచ్చర్ కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు.ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ మాట్లాడుతూ విమానంలో తోటి పైలెట్ కత్తిపోట్లకు గురైనా ధైర్యం కోల్పోకుండా ప్రయాణికులను రక్షించాలనే తపనతో వ్యవహరించిన మచ్చర్ తెగువకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తన ప్రాణం పోతుందని తెలిసినా లెక్కచేయకుండా 180 కుటుంబాల్లో వెలుగులు నింపిన స్మిత్ మచ్చర్ నిజమైన హీరో ఆయన త్యాగం నేటి యువతకు దిక్సూచి. భారతదేశం గర్వించదగ్గ ఇలాంటి యువకుడికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తోంది. ఆయన ధైర్యానికి గుర్తుగా ఈ మొక్క చిరకాలం బతికి ఎందరికో నీడనిస్తుంది స్ఫూర్తినిస్తుంది అని భావోద్వేగంగా కొనియాడాడు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :