తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలో మంగళవారం, డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, ఆధార్ కార్డు చూపిస్తూ టికెట్ కొట్టమని కండక్టర్తో గొడవకు దిగింది. ఆధార్ కార్డు చెల్లదని కండక్టర్ చెప్పడంతో, ఆమె మద్యం మత్తులో బూతులు తిడుతూ బస్సు ఎదురుగా కూర్చొని వీరంగం సృష్టించింది. దీంతో బస్సును ఆపి ఆమెను కిందకు దించగా, రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకుని అరుపులు కేకలు పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు
Admin
తెలుగు వెలుగు టీవీ